Shruti Haasan replaces Samantha in Chennai Story: సుమారు మూడు ఏళ్ల క్రితం 2021 చివరలో సమంత ఒక ఇంటర్నేషనల్ ఫిలిం లో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఇంగ్లీష్ ఫిలింలో సమంత ఒక డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు, ఆ సినిమా ఒకటి ఉందని కూడా జనాలు మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ సినిమా నుంచి సమంత తప్పుకున్నారు. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ ఆధారంగాతెరకెక్కుతోంది. సమంత తప్పుకోవడంతో ఆమె స్థానంలో శృతిహాసన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Janasena: జనసేనలో చేరిన 30 ఇయర్స్ పృథ్వి.. శ్యాంబాబు వేషధారణతో ప్రచారం!
ఈ సినిమాకి చెన్నై స్టోరీ అని టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ కాల్రా మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు, త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రొమాంటిక్ కామెడీ జాన్రా లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ అను అనే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తోంది ఈ డిటెక్టివ్ పాత్ర బై సెక్స్యువల్ అని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ మధ్యనే సలార్ సీజ్ ఫైర్ సినిమాతో హిట్ అందుకున్న శృతిహాసన్ అడవి శేషు హీరోగా నటిస్తున్న డెకాయిట్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. సమంత తప్పుకోవడంతో అనూహ్యంగా ఈ ప్రాజెక్టు కూడా ఆమెకు కలిసి రావడం గమనార్హం.