యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్, జీవితాల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ‘శివాత్మిక రాజశేఖర్’. మొదటి సినిమా ‘దొరసాని’తోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక ఆ తర్వాత స్టార్ స్టేటస్ అందుకునే సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత శివాత్మిక నటించిన సినిమా ఆడియన్స్ ముందుకి రాబోతోంది. మొత్తం ఐదు కథలుగా తెరకెక్కిన ‘పంచతంత్రం’ సినిమాలో ఒక కథలో శివాత్మిక నటించింది. మిగిలిన కథల్లో బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. హరీష్ శంకర్, జీవితా రాజశేఖర్ అతిథులుగా వచ్చిన ఈ ఈవెంట్ లో శివాత్మిక మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యి స్టేజ్ పైనే ఏడ్చేసింది.
పంచతంత్ర చిత్ర యూనిట్ తో తనకున్న రిలేషన్ గురించి మాట్లాడుతూ శివాత్మిక ఎమోషనల్ అయ్యింది. ‘‘సారీ అండి నార్మల్‌గానే నేను స్పీచ్ అంటే ఏడుస్తాను. ఈ సినిమాకు మరీ కష్టమవుతోంది’’ అని ముందే చెప్పిన శివాత్మిక, “దివ్య, విద్య”ల గురించి మాట్లాడే సమయంలో ఏడ్చేసింది. “దివ్య, విద్య చాలా టాలెంటెడ్. మీరు గెలిస్తే నేను గెలిచినట్టే. అందుకే నేను గెలవాలనుకుంటున్నా’’ అంటూ శివాత్మిక కంటతడి పెట్టుకుంది. దీంతో స్టేజ్ పైనే ఉన్న దివ్య, విద్య, స్వాతి, జీవిత.. శివాత్మికను ఓదార్చారు. ‘‘ఈ సినిమా ఆడాలండి బాబూ’’ అంటూ శివాత్మిక స్పీచ్ కి ఎండ్ ఇచ్చింది. మరి శివాత్మిక కోరుకున్నట్లు, పంచతంత్రం సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుందో లేదో చూడాలి.
స్టేజ్ పై ఏడ్చేసిన శివాత్మిక రాజశేఖర్!#ShivathmikaRajashekar #Panchathantram #harishshankar #samuthirakani #brahmanandam #SwathiReddy #ShravanBharadwaj #PanchathantramOnDec9 #AkhileshVardhan #NTVTelugu #NTVENT pic.twitter.com/tSiZu2Gu0t
— NTV Telugu (@NtvTeluguLive) December 8, 2022