Shiva Balaji: సింధూరం కోసం మొదటిసారి ఆ పని చేశాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Balaji: టాలీవుడ్ నటుడు శివబాలాజీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. హీరోగానే కాకుండా నటుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక తాజాగా శివబాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సింధూరం. శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి జంగా, చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన శివబాలాజీ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు.
“డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి వచ్చి సింధూరం సినిమా కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఈ సినిమా జానర్ విన్నప్పుడు ఇదొక ఇంటెన్స్ జానర్ అనిపించింది. కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు కాంట్రవర్సీ అవుతుందేమో అనిపించింది. డైరెక్టర్ బాగా రీసెర్చ్ చేసి ఈ కథ రాసుకున్నారు. నేను మొదటిసారిగా నక్సలైట్ గా కనిపించబోతున్న సింధూరం సినిమా కొత్త కథ, కథనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సింధూరం ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు.
Also Read
ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రతి ఆర్టిస్ట్ చాలా ఫోకస్ తో ఈ సినిమా చేశారు. తమిళ్ లో ఆల్రెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రిగిడ ఈ సినిమాతో తెలుగులో లాంచ్ అవుతోంది. హీరో ధర్మ మహేష్ ఫస్ట్ సినిమా అయినా సరే చాలా నేచురల్ గా చేశాడు, కిషోర్ డైలాగ్స్ బాగా కుదిరాయి. నిర్మాత ప్రవీణ్ కు ఉన్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ శ్యామ్ కు ఉన్న నాలెడ్జ్ సిందూరం సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లాయి. సింధూరం లాంటి కథతో సినిమా రావాలంటే మరో 10 – 15 సంవత్సరాలు తప్పకుండా పడుతుంది. అలాంటి కథ ఇది. సంగీత దర్శకుడు హరి గౌరవ మ్యూజిక్ ఈ సినిమాకు మరో అసెట్ అవుతుందని” తెలిపాడు.
తాజావార్తలు
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..