Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారనే దానిపై రకరకాల రూమర్లు వినిపించాయి. చివరకు షైన్ టామ్ చాకోను తీసుకున్నారనే ప్రచారం అయితే ఉంది. ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ లో తీస్తున్నారంట. అలాగే మాస్ యాక్షన్లు, ఎమోషన్లకు కొదువ లేదని తెలుస్తోంది. ఇందులో విలన్ గా ఎవరిని తీసుకుంటారనే దానిపై రకరకాల ప్రచారం జరిగింది. కానీ చివరకు మలయాళ నటుడిని తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Also : Little Hearts : దుమ్ము లేపిన లిటిల్ హార్ట్స్.. మరో రికార్డు
అతను ఎవరో కాదు షైన్ టామ్ చాకో. ఇతను దసరా సినిమాలో విలన్ గా నటించాడు. కానీ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని అరెస్ట్ కూడా అయ్యాడు. దాంతో పాటు మరికొన్ని కాంట్రవర్సీల్లోనూ ఇతను ఉన్నాడు. అయినా సరే అవన్నీ పక్కన పెట్టి అతన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. షైన్ టైమ్ చాకో మంచి నటుడు. కామెడీతో పాటు సీరియస్ విలనిజం చేయగలడు. అందుకే అతన్ని ఈ సినిమాలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కామెడీ విలన్ పాత్రలో నటించాలి కాబట్టి అతన్ని సెలెక్ట్ చేశారంట. మరి చిరంజీవి పక్కన ఇతను ఎలా నటిస్తాడో చూడాలి.
Read Also : Laya : లయ ఫస్ట్ లుక్.. ‘నా కుటుంబం జోలికి వస్తే!’