ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుంది కానీ విమర్శలు, వివాదాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇది అసలు రామాయణమే కాదు అని కొందరు అంటుంటే, అన్ని కోట్లు పెట్టి ఇలాంటి సినిమానా చేసేది అంటూ విమర్శించే వాళ్లు ఇంకొంతమంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి, సినీ వర్గాల నుంచి, కామన్ పబ్లిక్ నుంచి కూడా ఆదిపురుష్ సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఇండియా ఫస్ట్ సూపర్ హీరో శక్తిమాన్ ‘ముఖేష్ ఖన్నా’ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ ముంతాషి, హీరో ప్రభాస్ లని స్ట్రెయిట్ గా ముఖేష్ విమర్శించాడు.
Read Also: Lust Stories 2 : తమన్నా పై పొగడ్తల వర్షం కురిపించిన విజయ్ వర్మ..
“రామాయణం కామెడీ ఎలా అవుతుంది. రామాయణం ఆధారంగా తీసిన చెత్త డ్రామాలో ఇది ఒకటి, రామాయణం ని అపహాస్యం చెయ్యడానికే ఈ సినిమా తీశారు. అసలు దర్శకుడు ఓం రౌత్, మాటల రచయిత మనోజ్ ముంతాషి ఈ సినిమా తీసే ముందు రామాయణం చదివారా? స్క్రీన్ ప్లే, మాటలు చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఒక మహా గ్రంధం అయిన రామాయణాన్ని అపహాస్యం చెయ్యడానికి ఈ సినిమా తీశారు? అని ముఖేష్ ఖన్నా సీరియస్ కామెంట్స్ చేసాడు. రావణుడి పాత్ర డిజైన్ చేసే విధానాన్ని, ఆ పాత్రని మలిచిన తీరుని కూడా ముకేశ్ తప్పు బట్టాడు. “అసలు రావణుడి పాత్రకి సైఫ్ అలీ ఖాన్ ఎలా దొరికాడు నీకు. రావణుడు ఒక స్ముగ్లర్ లా కనిపిస్తున్నాడు ఇందులో” అని ముకేశ్ ఖన్నా మాటల యుద్ధం చేసాడు. ప్రస్తుతం ముఖేష్ ఆదిపురుష్ సినిమాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.