Mukesh Khanna: శక్తి మ్యాన్ సీరియల్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు నటుడు ముఖేష్ ఖన్నా. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్న ముఖేష్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చని విషయమై నెటిజన్లతో చర్చిస్తూ ఉంటాడు. ఇక మొన్నటికి మొన్న కపిల్ శర్మ ఒక బూతు షో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుకొన్నాడు. ఇక ఆ వివాదం నుంచి బయటపడకముందే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తలో నిలిచాడు. అయితే ఈసారి ఆడవారిని కించపరుస్తూ మాట్లాడడంతో నెటిజన్లు ఆయనను ఏకిపారేస్తున్నారు.
ఆన్ లైన్ సెక్స్ రాకెట్ గురించి వివరిస్తూ ” బెడ్ షేర్ చేసుకుంటాను అని చెప్పే అమ్మాయిలను నమ్మకండి. నా దృష్టిలో అలా చెప్పేవారు అమ్మాయిలే కాదు వారు వ్యభిచారులు. పద్దతిగా పెరిగిన ఏ ఆడపిల్ల, ఒక పురుషుడితో పడుకోవాలని ఉంది అని కోరదు. అలా అడిగింది అంటే ఆమె ఆడది కాదు.. ఆమెకు సమాజంలో బతికే అర్హతే లేదు. దయచేసి అలాంటివారికి దూరంగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవారి గురించి ఇంత ఘాటుగా మాట్లాడానికి మీకు నోరు ఎలా వస్తుంది. అందరు ఆడవారు కావాలని చేయరు.. అసలు ఆడవారి గురించి ఇలా మాట్లాడడం పద్దతి కాదు అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. మరికొందరు ఏ అమ్మాయి నిన్ను రమ్మని అడగలేదా..? అందుకే కోపంతో చెప్తున్నవనుకుంటా ఇవన్నీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.