Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 17న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఎంకెఆర్స్ ప్రమోషన్ల జోరును వేగవంతం చేసేశారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు. “మల్లికా మల్లికా మాలతీ మాలికా.. చూడవా చూడవా ఏడి నా ఏలిక” అంటూ సాగిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకొంటుంది. తన భర్త దుష్యంతుడి కోసం ఎదురు చూసే శకుంతల తన చుట్టూ ఉన్న మొక్కలు, పక్షులతో మనసులోని బాధను అందంగా వ్యక్తం చేస్తుంది.
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా.. రమ్య బెహరా అద్భుతమైన వాయిస్ తో ఆలపించింది. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌గా ఆవిష్కరిస్తున్నారు గుణ శేఖర్. ఇక ఈ చిత్రంలో సమంత అందమే అందం అని చెప్పుకోవాలి, నిజంగా దేవ కన్యలు ఇలానే ఉంటారా..? అనేంత అందంగా ఉంది సామ్. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో సామ్ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.