Sensational price for Leo Telugu Rights: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా చేశాడు తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి. ఆ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేశారు. దిల్ రాజు నిర్మాత కావడంతో గట్టిగానే థియేటర్లు ఇవ్వడంతో కొంతలో కొంత తెలుగులో కలెక్షన్స్ విషయంలో సేఫ్ అయిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ లియో అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో తిరుగులేని దర్శకుడుగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ఈ సినిమా ఉంటుందని భావిస్తూ ఉండడంతో సినిమా మీద భారీగా ప్రేక్షకులు అందరిలో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు లోకేష్ చివరి చిత్రం విక్రమ్ తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగు హక్కులు అమ్మేందుకు నిర్మాతలు భారీ రేటు ఫిక్స్ చేసినట్లుగా చేరుస్తుంది.
OTT Releases: సినీ లవర్స్ కి పండగే.. ‘మళ్లీ పెళ్లి’ సహా ఒకే రోజు ఏకంగా 28 సినిమాలు
ఆకాశమే హద్దు అనే విధంగా తెలుగు హక్కుల రేట్ ఉందని తెలుస్తోంది. నిజానికి తలపతి విజయ్ లియో సినిమా ఇప్పటికే నాన్ థియేటర్, డిజిటల్, ఓవర్సీస్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. అయితే ఇప్పుడు తెలుగు రిలీజ్ రైట్స్ ఏకంగా పాతిక కోట్ల రూపాయలు ధర ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి విజయ్ హీరోగా రిలీజ్ అయిన చివరి చిత్రం దాదాపు 12 కోట్ల రూపాయల వరకే పరిమితమైంది. కానీ డైరెక్టర్ మంచి ఫామ్ లో ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్న క్రమంలో తెలుగు హక్కుల కోసం భారీ రేటు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు విజయ్ కి ఉన్న మార్కెట్ కి లోకేష్ కనకరాజ్ మార్కెట్ కూడా తోడవడంతో ఈ మేరకు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి, బోయపాటి రామ్ సినిమా, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.