నట సింహం నందమూరి బాలకృష్ణ..దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2-తాండవం’ . ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. అది కూడా మహా కుంభమేళాలో ప్రారంభం కావడం విశేషం.
ఇటీవల అక్కడ షూటింగ్ గురించి బోయపాటి మాట్లాడుతూ అఘోర పాత్రలతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళలో కోట్ల మంది భక్తుల మధ్య, లక్షల మంది అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఉన్నాయి. ఈ సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులను కలిసాం. మా షూటింగ్ లో ప్రయత్న లోపం లేకుండా ‘అఖండ’ సినిమా షూటింగ్ చేస్తున్నామని తెలిపారు.కానీ కోట్ల మంది జనాల మధ్య షూటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఇది మూవీ టీం కి ఛాలెంజ్ అనే చెప్పాలి.
అయితే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి చాలా క్లారిటీగా ఉంటాడు. ఇక ‘అఖండ 2’ కోసం కూడా సెర్చింగ్ మొదలు పెట్టాడట. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. కాగా తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని టాక్. ఒకప్పటి హీరోయిన్ శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని.. అది ఓ సన్యాసిని అని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో శోభన పాత్రలో చాలా వేరియేషన్స్ కూడా ఉంటాయట.