Senior Director AS Ravikumar Chowdary Played Key Role In Natarathnalu: సుదర్శన్, ‘రంగస్థలం’ మహేశ్, అర్జున్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘నటరత్నాలు’. రామ్ గోపాల్ వర్మ వెండితెరకు పరిచయం చేసిన ఇనయా సుల్తానా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. నర్రా శివనాగు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మర్డర్ మిస్టరీ, క్రైం నేపథ్యంలో ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ చిత్రం యూత్‌నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కూడా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని దర్శకుడు నర్రా శివనాగు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టాకీ పనులు పూర్తయ్యాయని, పాటల చిత్రీకరణ మాత్రమే బాలెన్స్ ఉందని అన్నారు.
మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయని నిర్మాతలు డా. దివ్య, ఆనందాసు శ్రీ మణికంఠ తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. సీనియర్ దర్శకులు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి, సూర్య కిరణ్ ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం. అర్చన, శృతిలయ, సుమన్ శెట్టి, టైగర్ శేషాద్రి, చంటి, అట్లూరి ప్రసాద్, ఖమ్మం సత్యనారాయణ, ఎంఎన్ఆర్ చౌదరి, నల్లమల రంజిత్ కుమార్, ఖమ్మం రవి, షైనీ, శాటిలైట్ అమరేంద్ర, మాస్టర్ రిత్విక్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సిహెచ్ నాగమధు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.