ప్రస్తుతం తెలుగు సినిమాల్లో సీనియర్ హీరోయిన్ల హంగామా ఎక్కువైపోతోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారు ఇప్పుడు కుర్ర హీరోలకు అత్తలుగా, అమాంలుగా రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఇక ఈ సీనియర్ హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నటి ఖుష్బూ గురించి.. ఇటీవల ఏ సినిమాలో చూసినా అమ్మడి ఎంట్రీ ఉండాల్సిందే.మొన్నటికి మొన్న పెద్దన్న లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమా కాకుండా మరో స్టార్ హీరో సినిమాలోనూ అమ్మడు ప్రధాన పాత్రలో నటిస్తుంది.
గోపీచంద్- శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోపీచంద్ 30 లో ఖుష్బూ కీలక పాత్రలో నటించనుంది. ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్- వికేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ సీనియర్ నటి ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.