Senior Actor Shiva Krishna Sensational Comments On Rana Naidu And OTT Content: ఎవరేమనుకున్నా సరే.. ఓటీటీలు వచ్చాక అడల్ట్ కంటెంట్ బాగా పెరిగిపోయిందన్న మాట మాత్రం వాస్తవం. సెన్సార్ ఫార్మాలిటీస్ లేకపోవడం వల్ల.. వెబ్ సిరీస్‌లలో ఎలాంటి పరిమితులు లేకుండా బూతు సన్నివేశాల్ని జోడించేస్తున్నారు. కంటెంట్ పేరుతో శృంగార సీన్లను సైతం చిత్రీకరిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంతోమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ఎందరో గళం విప్పారు. ఇప్పుడు ఆ జాబితాలోకి తాజాగా సీనియర్ నటుడు శివకృష్ణ చేరిపోయారు. ఓటీటీలొచ్చాక అడల్ట్ కంటెంట్, అభ్యంతరకర సన్నివేశాలతో వెబ్ సిరీస్‌లు ఎక్కువ అయ్యాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రీసెంట్‌గా తాను ఓ వెబ్ సిరీస్ (రానా నాయుడుని ఉద్దేశించి) చూశానని, అది దాదాపు బ్లూ ఫిలిమేనని మండిపడ్డారు. ఓటీటీ కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాలని అన్నారు.
Live-in Relationship: ఇన్‌స్టాలో పరిచయం.. ఆపై సహజీవనం.. చివర్లో పెద్ద ట్విస్ట్
శివకృష్ణ మాట్లాడుతూ.. ‘‘రీసెంట్‌గా నేను ఒక వెబ్ సిరీస్ చూశాను. అది మరీ దారుణంగా ఉంది. ఆల్ మోస్ట్ అది ఓ బ్లూ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి దారుణమైన వెబ్ సిరీస్ చూడలేదు. ఇది మన సంసృతి, కల్చర్ కాదు. అసలు అది ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన వెబ్ సిరీసే కాదు’’ అంటూ పైర్ అయ్యారు. భార్యభర్తలు పడుకోవడానికి బెడ్‌రూమ్ ఉంటుందని.. అయితే ఆ బెడ్‌రూమ్ తలుపులు తీసి ఉంచడం, పిల్లలు అది చూడటం, మన సాంప్రదాయమేనా? అని ప్రశ్నించారు. దేశం ఆర్థికంగా పతనమైనా తిరిగి కోలుకుంటుంది కానీ.. సంస్కృతి పరంగా పతనమైతే ఆ దేశాన్ని కాపాడటం కష్టమవుతుందన్నారు. సినిమాల్లో బూతు ఉంటే, అది థియేటర్స్‌కి వచ్చిన వారికి మాత్రమే తెలుస్తుందని.. కానీ వెబ్ సిరీస్‌లు అలా కాదని అన్నారు. ఈమధ్య కాలంలో చాలామంది పాడైపోవడానికి కారణం ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లేనని.. కాబట్టి ఓటీటీకి కచ్ఛితంగా సెన్సార్ ఉండాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Groom Sings Song: వేదికపై పాట పాడాడు.. పెళ్లి పెటాకులైంది