సీనియర్ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి హీరోగా ఇప్పుడు స్టార్ యాక్టర్ గా ఆయన నటనకు ఫిదా కానీ వారుండరు. ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని తండ్రి పాత్రలో నరేష్ నటన అద్భుతం.. ఇక కెరీర్ పరంగా ఆయన గురించి, అయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వ్యక్తిగతంగా చెప్పాలంటే నరేష్ గురించిన ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. నరేష్ నాలుగో పెళ్ళికి రెడీ అవుతున్నాడట.. అది కూడా సీనియర్ నటి పవిత్రా లోకేష్ తో అని భోగట్టా. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే వైవాహిక జీవితంలో వచ్చే మనస్పర్దల కారణంగా ముగ్గురు భార్యలను వదిలి ప్రస్తుతం ఆయన ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే గత కొన్ని నెలల నుంచి నటి పవిత్రా లోకేష్ తో నరేష్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట పలు సినిమాలో భార్యాభర్తలుగా నటించారు. ఇప్పుడు రీల్ జీవితాన్ని రియల్ గా నిజం చేయాలనుకుంటున్నారట.
ఇటీవలే ఈ ప్రేమ జంట మహా బలేశ్వరంలోని ఒక గుడిలో దర్శనమివ్వడమే కాకుండా తమ పెళ్లి గురించి ఒక స్వామిజీ తో మాట్లాడినట్లు పలువురు తెలుపుతున్నారు. జీవితంలో అన్ని ఉన్నా ఒంటరితనం ఎంతో బాధిస్తుందని, ఈ వయస్సులో ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఒక తోడు అవసరమని భావించి నరేష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీలోని నరేష్ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. ఇక పవిత్ర లోకేష్ సైతం నరేష్ తో జీవితం పంచుకోవాలని అనుకుంటున్నదని టాక్.. ఆమె కూడా సుచేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని వివాహమాడి కొన్ని విబేధాల వలన విడాకులకు అప్లై చేసింది.. అయితే చట్టబద్ధంగా కోర్టులో విడాకులు మంజూరు కాగానే నరేష్, పవిత్ర పెళ్లి పీటలు ఎక్కనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయమై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది నరేష్ ను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే ఈ జంట నోరు విప్పాల్సిందే.