Satya Prem Ki Katha: కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన ‘సత్యప్రేమ్ కి కథ’ సినిమా నెలాఖరులో విడుదల కానుంది. తుది మెరుగుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా కోసం ప్రత్యకంగా ఓ హిట్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. కార్తీక్, కియారాపై ముంబైలో ప్రత్యేకమైన సెట్ లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. తన సోషల్ మీడియాలో కార్తిక్ ఆర్యన్ మిర్రర్ సెల్ఫీని షేర్ చేస్తూ, ‘సత్తు ఓల్డ్ స్కూల్ ప్యార్ కర్తా హై..’ అన్నాడు. ఈ సెల్ఫీ అప్‌లోడ్ చేయగానే అభిమానులు హార్ట్ సింబల్ తో పాటు ఫైర్ ఎమోజీలతో కార్తీక్ ను అభినందించారు. ఈ సినిమా నుంచి ‘నసీబ్ సే..’ పాట రిలీజ్ చేసిన తర్వాత కొత్తగా ‘ఆజ్ కే బాద్..’ని శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం తీస్తున్న ‘పసూరి..’ పాటను రిలీజ్ కి ముందు ఆవిష్కరించనున్నారు. ఈ పాటను అలీ సేథీ, షే గిల్ పాడారు.
NTR: ఎన్టీఆర్ కొత్త యాడ్ చూశారా.. అదరగొట్టేశాడు అంతే
సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ‘సత్యప్రేమ్ కి కథ’లో సుప్రియా పాఠక్ కపూర్, గజరాజ్ రావ్, సిద్ధార్థ్ రంధేరియా, అనూరాధ పటేల్, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 29, 2023న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీక్ ఈ ఏడాదితో 12 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకుంటున్నాడు. అవుట్ అండ్ అవుట్ లవ్ ఎంటర్ టైనర్ గా ‘సత్యప్రేమ్ కి కథ’ రూపొందిందని, తను ఏ తరహా జానర్ సినిమాలో నటించినా ఎంటర్ టైన్ మెంట్ ను మాత్రం వదలుకోనని చెబుతున్నాడు కార్తీక్.