Sathyaraj: మొదట్లో అనుదీప్ నన్ను వద్దన్నాడు.. రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sathyaraj Speech In Prince Pre Release Event: కేవీ అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘ప్రిన్స్’ సినిమా ఈనెల 21వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు(18-10-22) ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు. ‘‘అనుదీప్ తొలుత ఈ కథ వినిపించినప్పుడు, నన్ను తీసుకోవాలని శివకార్తికేయన్ సూచించాడు. కానీ అనుదీప్ అందుకు ఒప్పుకోలేదు. కట్టప్పలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ చేసిన ఆయన, కామెడీ రోల్‌కి అస్సలు సూట్ అవ్వరని రిజెక్ట్ చేశాడు. అప్పుడు శివకార్తికేయన్ తమిళనాడులో సత్యరాజ్ మంచి కామెడీ క్యారెక్టర్ అని, అక్కడ ఆయనకు కామెడీ రోల్స్ చాలా చేశారని చెప్పి రికమెండ్ చేశాడు. ఆ తర్వాతే నన్ను తీసుకోవడానికి అనుదీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా షూటింగ్ అయిపోయాక.. సార్ మీరు బాగా చేశారు, ఐయామ్ హ్యాపీ అని అనుదీప్ అన్నాడు’’ అని సత్యరాజ్ చెప్పుకొచ్చారు.
ఇంకా మాట్లాడుతూ.. తాను పదిహేనేళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తున్నానని, కానీ ‘అందరికీ నమస్కారం’ తప్పితే ఎక్కువ తెలుగు నేర్చుకోలేకపోయానని సత్యారాజ్ అన్నారు. కానీ.. హీరోయిన్ మరియా మాత్రం తెలుగు చాలా బాగా మాట్లాడుతుందని, ఉక్రెయిన్‌లో తెలుగు మీడియం చదువుకుందని సెటైర్లు వేశారు. అప్పుడు వెంటనే యాంకర్ సుమ అందుకొని, అనుదీప్‌తో సినిమా చేశాక సార్ (సత్యరాజ్) ఇలా మారిపోయారేమోనని డౌట్‌గా ఉందంటూ వెంటనే పంచ్ వేసింది. అది నిజమేనని ధృవీకరిస్తూ.. ఈ సినిమా చేసిన తర్వాత తాను అనుదీప్‌లాగే మారిపోయానని సత్యరాజ్ పేర్కొన్నారు. తెలుగు ఆడియన్స్ ఇంతవరకూ తనని కట్టప్పలాగా, అలాగే తండ్రి పాత్రల్లోనూ చూస్తూ వచ్చారని.. కానీ ఈ సినిమాలో తనలోని కొత్త యాంగిల్‌ని చూస్తారని తెలిపారు. ఇకపై తనకు తెలుగులోనూ కామెడీ క్యారెక్టర్స్‌తో పాటు విలన్ రోల్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో తాను చాలా యంగ్‌గా కూడా కనిపిస్తానంటూ చివర్లో చమత్కరించారు. ఇక చివరగా.. ప్రిన్స్ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పి, తన ప్రసంగాన్ని ముగించారు.
Also Read
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
- Dharman : రజనీకాంత్ - రామ్ పోతినేని 'ధర్మన్' సంక్రాంతి రిలీజ్?
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!