యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, సత్యరాజ్ కీలకపాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా కోసం కూడా ప్రభాస్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు. శనివారం ‘రాధేశ్యామ్’ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తన సెంటిమెంట్ గురించి వెల్లడించాడు. సత్యరాజ్ తన ‘లక్కీ మస్కట్’ అని ప్రభాస్ చెప్పాడు. ‘రాధే శ్యామ్’ కంటే ముందు తాను సత్యరాజ్‌తో కలిసి చేసిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయని అన్నారు. “సత్యరాజ్ సార్ నా లక్కీ మస్కట్. నేను ఆయనతో కలిసి చేసిన ‘మిర్చి’ సినిమా, ‘బాహుబలి సూపర్ హిట్ అయ్యాయి. ‘రాధే శ్యామ్’ మా కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా పవర్ ఫుల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది” అని ప్రభాస్ అన్నారు.
Read Also : Mohan Babu and Vishnu : రంగంలోకి దిగిన నాయీ బ్రాహ్మణులు … కేసు నమోదు
1970ల నాటి నేపథ్యంలో సాగే ‘రాధే శ్యామ్’లో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తున్నాడు. ఇటలీ, జార్జియా, హైదరాబాద్‌లోని పలు అందమైన ప్రాంతాలలో చిత్రీకరించబడిన ఈ సినిమాలో అత్యుత్తమ సాంకేతిక అంశాలు, అద్భుతమైన విజువల్స్ తో రాబోతోంది. ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చ్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.