Sathya Raj : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. అందులోని ప్రతి సీన్ ఓ ట్రెండ్ సెట్టర్. ప్రభాస్ తోపాటు నటించిన వారందరికీ మంచి ఇంపార్టెన్స్ దక్కింది. మొదటి పార్టులో బాహుబలి కట్టప్ప తల మీద కాలు పెట్టే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే సినిమాల్లో ఏ హీరో కాలును ఇలా తల మీద పెట్టుకోలేదు. ఈ సీన్ గురించి తాజాగా సత్యరాజ్ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి కథ చెప్పడానికి రాజమౌళి నా ఇంటికి వచ్చారు. ముందు ఆయన నన్ను ఓ క్వశ్చన్ వేశారు. సార్ ఈ సినిమాలో ప్రభాస్ కాలును మీ తల మీద పెట్టుకోవాల్సి ఉంటుంది మీకే ఓకేనా అన్నాడు. నేను కథ చెప్పండి ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే కచ్చితంగా చేస్తాను అని చెప్పాను. ఆయన ముందు ఓకే అంటేనే కథ చెప్తా అన్నాడు.
Read Also : Srinu Vaitla : ‘ఢీ’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీనువైట్ల..
సరే మీరు కథ చెప్పండి అంటే ఆయన చెప్పారు. కథ విన్నాక నాకు ఆ సీన్ ఉండాల్సిందే అనిపించింది. ప్రతి మనిషికి ఈగో ఉంటుంది. అందులో నో డౌట్. కానీ ఆ ఇగోను పక్కన పెట్టి ఈ సినిమాలో నటించాను. సెట్ లో ఆ సీన్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రభాస్ నీ కాలు ఇవ్వు అన్నాను. దానికి ఆయన కంగారు పడేవారు. సార్ నా కాలు ఇవ్వడమేంటి అంటూ తెగ మొహమాట పడేవాడు. చాలా హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న వ్యక్తి ఆయన. కానీ సినిమా కోసం తప్పదు కాబట్టి చివరకు ప్రాక్టీస్ చేశాం. కానీ ప్రభాస్ ఆ సీన్ కోసం చాలా ఇబ్బంది పడ్డాడు అంటూ తెలిపాడు సత్యరాజ్.
Read Also : Srinu Vaitla : మహేశ్ బాబు విషయంలో ఆ బాధ ఉంది.. శ్రీను వైట్ల కామెంట్స్