యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి శోభన్ బాబు’. 2023 స్టార్ట్ అయిన మొదటి నెలలో ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సంతోష్ శోభన్, ఫిబ్రవరిలో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మాస్టర్ సినిమా ఫేమ్ గౌరీ, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాని ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్, సుష్మిత కొణిదెల కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని ప్రశాంత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. కమ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ మరి కాసేపట్లో గ్రాండ్ గా జరగనుంది. బంజారా హిల్స్ లోని ‘ర్యాడిసన్ బ్లూ’ హోటల్ లో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.
ఈ ఈవెంట్ అయిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ ని చేస్తే శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఆడియన్స్ దృష్టిలో పడుతుంది లేదంటే సంతోష్ శోభన్ లిస్టులో మరో ఫ్లాప్ చేరుతుంది. పైగా ఫిబ్రవరి 17న ఆంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా, ధనుష్ నటిస్తున్న సార్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ థియేటర్స్ అన్నీ ఈ సినిమాలకే వెళ్తాయి. ధనుష్ మూవీకి హిట్ టాక్ వస్తే ఆ తర్వాత రిలీజ్ అయ్యే ఏ మూవీకి అయినా థియేటర్స్ దొరకడం కష్టం అవుతుంది. ఇది చాలదన్నట్లు ఫిబ్రవరి 18నే గీతా ఆర్ట్స్ నుంచి వినరో భాగ్యము విష్ణు కథ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ని బాగానే చేశారు కాబట్టి కిరణ్ అబ్బవరం సింగల్ స్క్రీన్ లో మంచి ఆకుపెన్సీని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా గీత ఆర్ట్స్ నుంచి కిరణ్ అబ్బవరం సినిమాకి మంచి నంబర్ ఆఫ్ థియేటర్స్ అయితే వస్తాయి, సుష్మిత కొణిదెల ఉంది కాబట్టి సంతోష్ శోభన్ సినిమాకి కూడా థియేటర్స్ బాగానే దొరికే ఛాన్స్ ఉంది. మరి సంతోష్ శోభన్, ఈ శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో అయినా ఫ్లాప్ స్ట్రీక్ కి బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.
Only 2Hrs To Go!🔥
To Meet and Greet our #SrideviSobhanBabu team at Grand Pre Release Event from 3PM onwards🥳
🎟️https://t.co/88E2dTXyJl@santoshsoban @Gourayy @sushkonidela #VishnuLaggishetty @dimmalaprasanth @GoldBoxEnt @SyedKamran @NagaBabuOffl @vamsikaka @shreyasgroup pic.twitter.com/v8iPgHIso1
— Gold Box Entertainments (@GoldBoxEnt) February 15, 2023