మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు ‘సర్కారువారి పాట’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యాసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతున్నా విషయం విదితమే.
వేలాదిమంది అభిమానుల మధ్య ఈ వేడుక అట్టహాసంగా మొదలయ్యింది. ఇక ప్రముఖ యాంకర్ సుమ తనదైన జోష్ తో ఈ ఈవెంట్ ను మొదలుపెట్టింది. రావడం రావడంతోనే మహేష్ డైలాగ్స్ తో రచ్చ షురూ చేసింది. ఇక సుమ తో పాటు టీవీ కమెడియన్ సద్దాం కూడా తోడవ్వడంతో స్టేజ్ పై నవ్వులు పూశాయి. మరికొద్దిసేపటిలో థమన్ మ్యూజిక్ బ్యాండ్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.