‘సర్కారు వారి పాట’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు మెంటల్ మాస్ స్వాగ్ అని ఏ ముహూర్తాన మేకర్స్ అన్నారో కానీ.. ఆ స్వాగ్ అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే వెంటేజ్ లుక్ లో మహేష్ లుక్ కి ఫిదా అయిన ఫ్యాన్స్ ట్రైలర్ లో మహేష్ యాక్షన్, కామెడీ, రొమాన్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక ఈ సినిమాలో మాస్ సాంగ్ ఉందని, మహేష్ ఊర మాస్ డ్తెప్స్ తో అలరిస్తాడని చెప్పడంతో దేవుడా ఏది కదా మేము మహేష్ నుంచి కోరుకుంటున్నాం అంటూ ఆ పాట ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అని వెయ్యి కళ్ళతో ఎదురుచుస్తున్నారు. ఇక ఆ తరుణం రానే వచ్చింది.
‘సర్కారు వారి పాట’ చిత్రంలో మాస్ సాంగ్ ‘మ.. మ. మహేశా’ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు . అంటారు ఊహించినట్లుగానే మహేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. పూల పూల డ్రెస్ లతో, కాలుకు రుమాలు కట్టుకొని ‘సన్నజాజి మూర తెస్తా సోమవారం.. మల్లెపూల తెస్తా మంగళవారం..’ అంటూ కీర్తి కోసం ఊర నాటు లిరిక్స్ కి మాస్ స్టెప్పులు వేస్తూ కనిపించాడు. ఇక కీర్తి కూడా ఈ సాంగ్ లో ఎంతో అద్భుతంగా కనిపించడమే కాకుండా మహేష్ కు ధీటుగా స్టెప్స్ వేసి ఔరా అనిపించింది. ‘మ.. మ ..మ.. మహేశా.. నీ..నీ..నీ ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా’ అంటూ ఊపు తెప్పించింది. ప్రోమోలోనే ఫ్యాన్స్ ఈ రేంజ్ లో ఊగిపోతే ఇక ఫుల్ సాంగ్ కు థియేటర్లో పూనకాలు రావడం ఖాయమే అందంలో అతిశయోకి లేదు. ఈ ఫుల్ సాంగ్ లిరికల్ వీడియో రేపు రిలీజ్ కానుంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
https://www.youtube.com/watch?v=-o0r_MljIXg