సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ రిలీజ్ కు దగ్గరపడుతోంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు పరుశరామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ దగ్గరనుంచి సాంగ్స్, ట్రైలర్ వరకు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో మహేష్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. ఇక ఈ చిత్రంలో మహేష్ ఒక మాస్ సాంగ్ లో ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టబోతున్నారని మేకర్స్ చెప్పినప్పటినుంచి ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ కాబోతుందా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇక తాజాగా ఆ తరుణం రానే వచ్చేసింది. గత రెండు రోజుల నుంచి ‘సర్కారువారి పాట’ నుంచి సర్ ప్రైజ్ రానుంది అని మేకర్స్ అభిమానులను ఊరించిన సంగతి విదితమే.. ఇక ఎట్టకేలకు ఆ సర్ ప్రైజ్ ను మేకర్స్ రివీల్ చేశారు. . సినిమాలోని ‘మా మా మహేషా..’ అనే మాస్ సాంగ్ ని రేపు శనివారం మే 7న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక దీంతో పాటు మాస్ పోస్టర్ నుం కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో మహేష్, కీర్తి సురేష్ కలర్ ఫుల్ డ్రెస్ లో ఒక మాస్ స్టెప్పు వేయబోతు కనిపించారు. ఇందులో మహేష్ ఊర మాస్ స్టెప్పులతో అడగొట్టాడని టాక్ వినిపిస్తోంది. కీర్తి సైతం మహేష్ కు ధీటుగానే స్టెప్పులతో అలరించిందని సమాచారం. ఈ సాంగ్ కు థియేటర్లో స్క్రీన్స్ చిరిగిపోతాయని అభిమానులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలంటే ఇంకొక రోజు ఆగాల్సిందే.