సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గీతాగోవిందం’ చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్న పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన మొదటి సారి మహానటి కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తునానఁ విషయం విదితమే.. ఇక నేడు ఈ సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు. థియేటర్ల వద్ద మహేష్ కటౌట్స్, ఫ్లెక్సీలతో పండగ వాతావరణాన్ని సృష్టించారు. ఇక మార్నింగ్ షోలు చూసి బయటికి వచ్చిన ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు.. మహేష్ వన్ మ్యాన్ షో.. సినిమా అదిరిపోయింది అంటూ తమదైన శైలిలో రివ్యూలు ఇస్తున్నారు. మహేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఈ సినిమాలో మహేష్, వెన్నెల కిషోర్ కామెడీ అల్టిమేట్ అని చెప్తున్నారు. ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని, సాంగ్స్ లో మహేష్ డాన్స్ తో అదరగొట్టాడని తెలుపుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో మహేష్ ఎమోషనల్ సీన్స్ బావున్నాయని, ఏవ్ సినిమాకు హైలైట్ గా నిలిచాయని చెప్పుకొస్తున్నారు. ప్రమోషన్స్ లో మహేష్ బాబు చెప్పినట్లే ఫిసర్ట్ హాఫ్ లో కీర్తి సురేష్, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేస్తాయి అని, ఇక మెసేజ్ ఓరియెంటెడ్ కాకపోయినా చివర్లో ఒక మెసేజ్ ను అందించారని, మధ్యతరగతి కుటుంబాల మధ్య ఎమోషన్స్ డైరెక్టర్ బాగా చూపించాడని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా మహేష్ వన్ మ్యాన్ షో అని, మహేష్ ఫ్యాన్స్ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని మహేష్ అందించాడని, సినిమా అదిరిపోయిందని చెప్పుకొస్తున్నారు.