‘నాన్న’ సినిమాలో కూతురిగా నటించిన ఈ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఉన్న చైల్డ్ ఆర్టిస్టుల పేర్లు చెప్పమంటే.. టక్కున ఒక పది పేర్లు చెప్పుకొచ్చేస్తాం. కానీ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చాలా తక్కువమంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో చైల్డ్ ఆర్టిస్టులు అంటే ఒక్క పేరు కూడా గుర్తుకు రావడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఇక ఈ మధ్యకాలంలో ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్టులు.. హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. మూడేళ్ళ క్రితం స్టార్ హీరోలకు కూతుర్లుగా కనిపించిన చిన్నారులు.. ఇప్పుడు ముద్దుగుమ్మలుగా మారి కుర్ర హీరోలతో జంట కడుతున్నారు. ఇక పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు సారా అర్జున్. అదేనండీ.. విక్రమ్, అనుష్క జంటగా నటించిన నాన్న సినిమాలో విక్రమ్ కు కూతురుగా నటించిన అమ్మాయి సారా. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోకపోయినా సారా నటనకు మాత్రం అవార్డులు కూడా దక్కాయి.
Aishwarya Rai Bachchan: కళ్లు పెట్టి చూడండి మిత్రోన్.. ఇక వారికి విడాకులు ఇచ్చే పని ఆపండి
Also Read
మతిస్థిమితం లేని ఒక తండ్రి.. అతడి తండ్రి ప్రేమను అర్ధం చేసుకొనే కూతురుగా ఆమె నటన అద్భుతమని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆ చిన్నారి హీరోయిన్ గా మారింది. పొన్నియిన్ సెల్వన్ లో అలా వచ్చి ఇలా మాయమైపోయినా పార్ట్ 2 లో మాత్రం అదరగొట్టింది. చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ గా, కరికాలన్ ను ప్రేమించిన నందినిగా సారా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. విచిత్రం ఏంటంటే.. నాన్న లో విక్రమ్ కు కూతురిగా నటించిన సారా.. ఈ సినిమాలో చిన్నప్పటి విక్రమ్ కు ప్రేయసిగా నటించింది. పార్ట్ 2 లో ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత, ఐశ్వర్య లక్ష్మీ లాంటి అందగత్తెల మధ్యలో సారా తేలిపోకుండా.. తనదైన మార్క్ చూపించింది. వారికన్నా ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయే పాత్రతో మెప్పించింది. ఈ సినిమా తరువాత సారాకు హీరోయిన్ గా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి తెలుగులో ఈ చిన్నది ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..