Anni Manchi Sakunamule OTT Release Date: స్వప్న చిత్ర, మిత్రవింద మూవీస్ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ప్రియాంక దత్. నిర్మించిన ‘అన్నీ మంచి శకునములే’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర,ప్రసాద్, గౌతమి, వెన్నెల కిశోర్, రావు రమేశ్ నటించిన ఈ సినిమాను ఇండియాతో సహా ప్రవంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రైమ్ వీడియో ద్వారా జూన్ 17న వీక్షించవచ్చు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ డబ్ వెర్షన్స్ లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఈ మేరకు ప్రైమ్ వీడియో సంస్థ ఈ ప్రేమకథ చిత్రం ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించింది. రెండు విభిన్న ధృవాలు కలిగి ఎప్పుడూ గొడవపడే కుటుంబాల్లో జన్మించిన ఓ యువతి, యువకుడు ప్రేమలో పడితే ఏం జరిగిందన్న ఈ చిత్ర కథాంశం. వారి ప్రేమకు కుటుంబాల సమ్మతి లభిస్తుందా? భావోద్వేగాలు, సంఘర్షణ, ఆశలతో వారు అంతరాలను అధిగమించి ఆనందమమ జీవితాన్ని గడిపేందుకు ఆ ప్రేమికులు ఏం చేశారన్న దానిని దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన తీరు ఆకట్టుకునేలా సాగింది. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి