Batukamma:ప్రతి ఏటా బతుకమ్మ పై కొత్త కొత్త పాటలు వస్తుంటాయి. అలా ఈ సంవత్సరం కూడా పలు పాటలు ప్రాణం పోసుకున్నాయి. అవి యు ట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో సింగర్ రేఖా శ్రీ పాడిన ‘సన్స జాజుల బతుకమ్మ’ ఒకటి. మూర్తి తో కలసి రేఖా శ్రీ పాడిన ఈ పాటకు శివకృష్ణ చారి సాహిత్యాన్ని అందించగా రోహిత్ జిల్లా సంగీతాన్ని సమకూర్చారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఈ పాటను చిత్రీకరించినట్లు రేఖా శ్రీ చెప్పారు. సినిమా పాటలు పాడిన అప్పటి ఆనందం కంటే బతుకమ్మ పాటను పాడటం రెట్టింపు సంతోషాన్ని కలిగించిందని చెబుతున్నారు రేఖ. మరి ఈ పాటకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూద్దాం.