Karan Johar : బాలీవుడ్ ప్రొడ్యూసర్, దర్శకుడు కరణ్ జోహార్ కు, హీరో కార్తీక్ ఆర్యన్ కు చాలా రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ మీడియాలో వీరిపై వరుస కథనాలు కూడా వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ వీరిద్దరూ ఐఫా వేడుకల్లో కలిసి హోస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ వేడుకల్లో కరణ్ జోహార్ కార్తీ్క్ మీద సెటైర్లు వేశాడు. “కార్తీక్ నువ్వు బాలీవుడ్ లో కొత్త విద్యార్థివి. నేను ఎవర్ గ్రీన్ లెక్చరర్ లాంటి వాడిని. బాలీవుడ్ లో నీకు అసలైన రాజసం అంటే చూపిస్తాను. ఖాన్స్, కపూర్స్ మాత్రమే అసలైన బాలీవుడ్ స్టార్లు. మిగతా వాళ్లంతా వాళ్ల సినిమా ప్రాంచైజీలను కాపీ కొడుతున్నారు’ అంటూ సంచలన కామెంట్లు చేశాడు.
Read Also : Hydraa: కిస్మత్ పురలో ఉదయం హైడ్రా కూల్చివేతలు.. సాయంత్రానికి సీసీ రోడ్డు..
ఇది కార్తీక్ ఆర్యన్ ను కొంత అసహనానికి గురి చేసింది. కరణ్ కామెంట్స్ కు తనదైన స్టైల్ లో చురకలు అంటించాడు కార్తీక్. బాలీవుడ్ లో రాణించాలంటే ట్యాలెంట్ ఉండాలన్నాడు. తాను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమాలు చేస్తున్నట్టు తెలిపాడు. తాను నటించిన భూల్ భులయ్యా-3 హిట్ అయిందని.. కరణ్ డైరెక్ట్ చేసిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2 ప్లాప్ అయిందని సెటైర్ వేశాడు. కార్తీక్ ఆన్సర్ కు కరణ్ ముఖం వాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే స్టేజి మీద భూల్ భులయ్యా సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు కార్తీక్. కరణ్ చేసిన కామెంట్స్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ట్యాలెంట్ తో వచ్చే వారిని అవమానించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.