Bulliraju : బుల్లిరాజు.. ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్టు పేరు. ఏదైనా చైల్డ్ పాత్ర ఉందంటే మనోడినే ఫస్ట్ ఛాయిస్ గా తీసుకుంటున్నారంట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మనోడి రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని బుల్లిరాజు ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాతో అందరికంటే ఎక్కువగా గుర్తింపు వచ్చింది మాత్రం బుల్లిరాజుకే. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చానమిల్లి అనే ఊరికి చెందిన రేవంత్.. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు.…