Sankranthi Movies OTT Release Dates: ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నాలుగు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ముఖ్యంగా గుంటూరు కారం సినిమాతో పాటు హనుమాన్ సినిమాకి ముందు నుంచి మంచి బజ్ ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైన్ధవ్ సినిమాతో పాటు నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాతో పాటు తమిళనాడు నుంచి రెండు సినిమాలు తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నా సంక్రాంతి పోటీలో థియేటర్లు దొరకక ఆ రెండు సినిమాలు వాయిదా పడ్డాయి. అందులో ధనుష్ సినిమా 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ అయలాన్ సినిమా మాత్రం ఇంకా తెలుగులో రిలీజ్ అవ్వలేదు. అయితే సినిమాలు రిలీజ్ అయ్యి దాదాపు 20 రోజులు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది.
RC 16: ఇదంతా చూస్తుంటే ఆ బయోపిక్ లాగే ఉందే.. ఏకంగా 400 మందా?
అన్ని సినిమాల కంటే ముందుగా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైన్ధవ్ సినిమా ఓటీటీలోకి వస్తోంది. జనవరి 13వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి మూడో తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవబోతోంది. ఇక జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీ లేదంటే ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 15వ తేదీన విడుదల అవకాశాలు కనిపిస్తున్నాయి. హాట్ స్టార్ యాప్ తో పాటు అమెరికా దేశంలో ఉన్న వారికి హులు యాప్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక తేజ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా నటించిన హనుమాన్ సినిమా సంక్రాంతి సినిమాలన్నింటిలో భారీ బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ మార్చి రెండో వారం తర్వాత జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. అయలాన్ సినిమా కూడా ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ అవుతుంది కానీ తెలుగు వెర్షన్ ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు