Jigris : సందీప్ రెడ్డి వంగా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోని వాళ్ళు ఉండరు, ఘనంగా జరిగిన జిగ్రీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన సందీప్ రెడ్డి వంగా, టీజర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడారు. ప్రొడ్యూసర్ కృష్ణ వోడపల్లి నాకు LKG నుండి స్నేహితుడు.. నాకు చెప్తే సినిమా ప్రొడ్యూస్ చెయ్యదు అంటా అని, చెప్పకుండా స్టార్ట్ పెట్టిండు. Animal షూట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఇప్పుడే ఒక షెడ్యూల్ అయిపోయింది గోవాలో అని చెప్పాడు. ఇక నేను తిట్టుడు స్టార్ట్ పెట్టిన ఫోన్లోనే ఈ ప్రొడక్షన్ అవి ఎందుకని.. నేను Animal షూట్ గ్యాప్ లో హైదరాబాద్ వచ్చినప్పుడు విజువల్స్ చూపించాడు కొన్ని చాలా బాగున్నాయి. కొన్ని సీన్లు చూసిన చాలా బాగుంది కామెడీ, ఈరోజుల్లో కాన్ టెంపరరీ కామెడీ బూతులు లేకుండా చాలా బాగా రాసిండు, తీసిండు డైరెక్టర్ హరీష్, మ్యూజిక్ మాత్రం సూపర్ కమ్రాన్ సయ్యద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు అంటూ చెప్పాడు సందీప్.
Read Also : Coolie : ఆ హీరో వల్లే ‘కూలీ’ ఇంత లేట్ అయిందా..!
విజువల్ కి చాలా బాగా సూట్ అవుతున్నాయి. నాకు తెలిసి మూడు నాలుగు పాటలు ఉన్నాయి రిలీజ్ అవుతాయి త్వరలోనే పాటలు కూడా మీరందరూ చాలా మంచిగా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నా అని చెప్పారు. అలాగే టీజర్ లో చూసినట్టు టీజర్ లో కొంచెం తక్కువనే ఉంది కామెడీ ఇంకా సినిమాలో చాలా ఎక్కువ ఉంటుందనిపిస్తుంది నాకు. మన తెలుగు ఆడియోన్స్ కే ఒక క్వాలిటీ ఉంది సో ప్రొడ్యూసర్ తో సంబంధం లేదు డైరెక్టర్ తో సంబంధం లేదు సినిమా బాగుంటే బ్లాక్ బస్టర్ చేస్తారు. ఈ చిన్న సినిమాని నిజంగా సపోర్ట్ చేయండి వీళ్ళు మామూలు హార్డ్ వర్క్ చేయలేదు, అందరు చేస్తారు బట్ ఇది వేరే రకమైన హార్డ్ వర్క్ ఇది సో రిలీజ్ అయ్యి హిట్ అయినాక చెప్పుకుంటారు వీళ్ళు, వీళ్ళు గోవాలో సూట్ చేస్తున్నప్పుడు పోలీసు పట్టుకున్నవి మహారాష్ట్ర బోర్డర్లో షూట్ చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నవి అవన్నీ బయటకు వస్తాయి తర్వాత అవన్నీ విన్నాక అర్థమవుతుంది అసలు ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు అని, సో ఎగ్జాక్ట్లీ సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం మళ్ళీ, సో గుడ్ లక్ టు ఆల్ ద జిగ్రీస్, ఎవరెవరో సినిమాలు చూస్తున్నారు కదా మన తెలుగోళ్ళే హీరోలందరూ వచ్చి చూడండి అని అన్నారు.
Read Also : Tollywood Hero : ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసా..?
అలాగే కృష్ణ తోటి వినయ్ కూడా కో ప్రొడ్యూసర్ అతను కూడా కొత్తోడే, త్వరలో రిలీజ్ చేస్తున్నారు, మీ జిగ్రీస్ తో పాటు వచ్చి చూడండి అని చెప్పారు. కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ లు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇంకా తదితరులు వచ్చారు. బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తోంది.