Amithabachan : బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్న అమితాబ్ కు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. నాకు సోషల్ మీడియాలో 49 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్యను ఎలా పెంచుకోవాలి అంటూ ఓ పోస్టు చేశారు. దానికి నెటిజన్లు రకరకాల ఆన్సర్లు ఇస్తున్నారు. ఇప్పుడు పెట్రోల్ ధరలపై మీరు ఒక వీడియో చేస్తే చాలు మీ ఫాలోవర్లు మరో 10 మిలియన్లు పెరిగిపోతారు అంటూ కొందరు పోస్టు చేస్తున్నారు.
Read Also : JR NTR : ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత దేవర-2..?
ఇంకొందరేమో మీ కోడలు ఐశ్వర్యరాయ్ తో కలిసి ఓ వీడియో చేయండి అంటున్నారు. కానీ ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్ మాత్రం నటి రేఖను పెళ్లి చేసుకోండి అనేశారు. ఈ కామెంట్ ఎక్కువ మంది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే.. గతంలో అమితాబ్, రేఖ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అప్పట్లో వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ ఉండేది. ఆ తర్వత ఎవరి దారుల్లో వారు బిజీ అయిపోయారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేశాయి. మరి బిగ్ బీకి ఇంకా ఫాలోవర్లు కావాలని ఎందుకు అనిపించిందో మాత్రం ఆయన చెప్తేనే ఓ క్లారిటీ వస్తుందేమో. ప్రస్తుతం ఆయన కల్కి-2తో పాటు మరో మూడు సినిమాలు చేస్తున్నారు.
T 5347 – बड़ी कोशिश कर रहे हैं, लेकिन ये 49M followers का नंबर बढ़ ही नहीं रहा है ।
कोई उपाय हो तो बताइए !!!— Amitabh Bachchan (@SrBachchan) April 13, 2025