టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి సమంత.. ఓ వైపు తానూ లీడ్ రోల్ లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారింది. సామ్ నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘శుభం’ . సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ శుభం ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఓ ముగ్గురు యువకులు.. ముగ్గురు యువతులు వారికీ టీవీ సీరియల్ పిచ్చి ఉండడం సరిగ్గా రాత్రి 9 గంటల అవగానే వారికి ఆ సీరియల్ లోని క్యారక్టర్ లు పునడం వంటి కాన్సెప్ట్ తో వస్తున్న శుభం ట్రేలర్ మెప్పించిందనే చెప్పాలి. చివరలో సమంత ఎంట్రీ బాగుంది. దయ్యాలను వదిలించే మంత్రిగత్తే గెటప్ లో సామ్ ఆకట్టుకుంది. హీరోయిన్ గా సూపర్ సక్సెస్ ను అనుడుకున్న సమంత నిర్మాతగా ఎటువంటి హిట్ అందుకుంటుందో మరోకొద్దీ రోజుల్లో తెలియనుంది. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన శుభం ట్రైలర్ ను సరదాగా ఓ సారి చూసేయండి.