సమంత టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా 'యశోద'. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ఉన్ని ముకుందన్ షూటింగ్ సమయంలో సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తనకు తెలియదని చెప్పారు!
ప్రస్తుతం అనారోగ్యంతో పోరాడుతున్న సమంత, తన తాజా చిత్రం 'యశోద' కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించింది. వీటిని ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ రూపొందించారు.
ప్రస్తుతం సమంత చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఒకటి, అరా సినిమాలకు, వెబ్ సిరీస్‌కు సైన్ చేసింది. అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. అయితే ఇవన్నీ కూడా ముంబైలో ఉంటూ ఆపరేట్ చేస్తోంది సమంత. ఈ నేపథ్యంలో సామ్ ముంబైకి మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ కాలనీలో సమంత ఓ ఖరీదైన ప్లాట్ తీసుకుందని వార్తలొచ్చాయి.…