అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెల్సిందే. ఈ జంట విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఇప్పటివరకు నిత్యం ఏదో ఒక వార్తలో ఈ జంట నిలుస్తున్నారు. ఇప్పటికి సామ్ ని విడాకుల విషయంలో చాలామంది ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇవేమి పట్టించుకోని సామ్ మాత్రం తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తుంది. ఒకపక్క సినిమాలు మరోపక్క స్నేహితులతో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇకపోతే విడాకుల తర్వాత చైతూ గురించి ఎప్పుడు మాట్లాడని సామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాజీ భర్త క్యారెక్టర్ ని బయటపెట్టింది. తన వద్ద డబ్బులు లేని సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి చైతూ అని చెప్పుకొచ్చింది.
” ఒకానొక సమయంలో నేను చైతన్యతో కలిసి షూటింగ్ చేసేటప్పుడు నా దగ్గర కనీసం అమ్మకు కాల్ చేసి మాట్లాడడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నా పరిస్థితిని అర్ధం చేసుకున్న చైతన్య.. వెంటనే నా దగ్గరకు వచ్చి తన ఫోన్ ఇచ్చి ఎంతసేపైనా మాట్లాడమని చెప్పాడు. చైతన్య పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్.. ఫైన్షియల్ గా చైతూ తనను ఆదుకున్నాడని ” చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే సామ్ ని చై అర్ధం చేసుకున్నట్లు మరెవ్వరు అర్ధం చేసుకోలేదంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి జంట విడిపోయారు అంటే నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. ఇకపోతే ఈ జంట సినిమాల విషయానికొస్తే సామ్ ప్రస్తుతం శాకుంతలం తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తుండగా.. చై థాంక్యూ, లాల్ సింగ్ చద్దా చిత్రాలతో పాటు ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.