టాలీవుడ్ స్టార్స్ సమంత, అక్కినేని నాగ చైతన్య విడిపోయి కొన్ని నెలలు గడుస్తోంది. ఇప్పటికీ వీరిద్దరూ ఏం చేసినా అది ఆసక్తికరంగానే మారుతోంది. అయితే సామ్ మాత్రం అక్కినేని కుటుంబంతో సన్నిహితంగానే ఉంటుంది. తాజాగా ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది సామ్. ఏప్రిల్ 8న అక్కినేని అఖిల్ బర్త్ డే. ఈ సందర్భంగా అఖిల్ కు సామ్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ స్వీట్ నోట్ షేర్ చేసింది. “హ్యాపీ బర్త్డే. ఈ సంవత్సరం మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీకు నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడ్ని కోరుకుంటున్నా” అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. అయితే సామ్ పోస్ట్ కు అఖిల్ ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మరి అఖిల్ స్పందిస్తాడా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : Dil Raju : పూజా మన కాజా… అడుగు పెడితే హిట్టే !
ప్రస్తుతం అఖిల్ “ఏజెంట్” సినిమాలో నటిస్తుండగా, సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. సమంత విషయానికొస్తే… యశోద, శాకుంతలం, అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది.

Akhil