ప్రస్తుతం స్టార్ హీరోయిన్లందరూ ఐటెం గర్ల్స్ గా మారిపోతున్నారు. ఒకప్పుడు ఐటెం సాంగ్ అంటే కొంతమంది మాత్రమే చేసేవారు. కానీ, ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం హీరోయిన్లు కూడా ట్రెండ్ మారుస్తున్నారు. ఇటీవల కాలంలో కుర్రకారును ఊపేసిన ఐటెం సాంగ్ ‘పుష్ప’ చిత్రంలోని ఊ అంటావా.. ఊఊ అంటావా. స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటెం సాంగ్ లో మెరిసేసరికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సామ్ అందచందాలు, బన్నీ మాస్ స్టెప్స్ .. చంద్రబోస్ ఊర మాస్ లిరిక్స్ కి థియేటర్లలో అభిమానుల్లకు పూనకాలు తెప్పించాయి.
పాన్ ఇండియా సినిమాగా విడుదలైన పుష్ప .. భారీ కలెక్షన్లను వసూలు చేసి భారీ విజయాన్ని అందుకొంది. ఇక నేడు ఓటిటీలో కూడా స్ట్రీమింగ్ కానుండడంతో ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే దాక్కో దాక్కో మేక, సామి సామి వీడియో సాంగ్ రిలీజ్ కాగా తాజాగా అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సామ్ ఐటెం సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. సాంగ్ లో సమంత లుక్స్, హాట్ స్టెప్స్ చెమటలు పట్టిస్తున్నాయి. ఈ సాంగ్ రిలీజైన దగ్గర నుంచి రికార్డులను కొల్లగొడుతూనే ఉంది. మరి ఈ వీడియో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.