టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతేడాది భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడం వలన విడిపోతున్నాం కానీ ఎప్పటికి స్నేహితులగానే ఉంటాం అని ఈ జంట ప్రకటించిది. ఇక సామ్ విడాకులు అయ్యిన దగ్గరనుంచి కోట్స్ రూపంలో ఏదో ఒక సందేశాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి తల్లి గురించి , గర్భం గురించి, పిల్లల గురించి స్టోరీలు పెట్టడంతో నెటిజన్స్ సామ్ కి తల్లి కావాలని ఉన్నా కొన్ని పరిస్థితుల వలన అది కుదరలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక సామ్- చై మ్యూచువల్ అభిమానులు ఈ జంట మళ్లీ కలవాలని కోరుకుంటున్నారు. అప్పట్లో సామ్ గురించి చైతన్య చేసిన కామెంట్స్, చైతూ గురించి సామ్ చెప్పిన విషయాలను నెమరువేసుకుంటున్నారు. తాజాగా సామ్ చెప్పిన ఒక విషయాన్ని మరోసారి నెటిజన్లు వైరల్ గా మార్చేశారు. గతంలో సామ్ కొద్దిగా బొద్దుగా కనిపించినా, ఇంకొద్దిగా మార్పు కనిపించినా సామ్ ప్రెగ్నెంటా ..? అంటూ అభిమానులు ఎంతో ఆశగా అడిగేవారు.
ఇక ఒకానొక సమయంలో సామ్ నవ్వుతూ తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పిన మాటలు మరోసారి వైరల్ గా మారాయి. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ లో ఒక నెటిజన్ మీరు తల్లి ఎప్పుడు అవుతారు అన్న ప్రశ్నకు సామ్ ” నా శరీరంలో వచ్చే మార్పుల గురించి మీరెంతో తపన పడుతున్నారో నాకర్ధమవుతుంది. వారందరికీ ఒక మంచి న్యూస్ చెప్తాను. 2022, ఆగస్టు 7 న ఉదయం 7 గంటలకు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నా” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ మాటలు సామ్ జోక్ గానే అన్నా నిజమైతే బావుండు అని ప్రతి ఒక్క అభిమాని కోరుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.
ఒక వేళ సామ్ చెప్పింది నిజమే అయితే.. ఈ జంట విడిపోకుండా ఉంటే ఈ పాటికి ఒక గుడ్ న్యూస్ ని అక్కినేని ఫ్యామీలీ అభిమానులకు తెలిపి ఉండేది అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇదే వార్త నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. అంటే నిజంగా కాకపోయినా సినిమాలో నిజమయ్యే అవకాశం ఉందనే చెప్పాలి. ప్రస్తుతం సామ్ తెలుగు, తమిళ్ లో ఒక బై లింగువల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో సామ్ ప్రెగ్నెంట్ లేడీ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆగస్టు 7 న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ అయినా రిలీజ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి ఎలాంటి అప్డేట్ ని ఆగస్టు 7 న సామ్ ఇవ్వనుందో..