అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత పేరు మారుమ్రోగిపోతుంది. వరుస విజయాలను అందుకోవడంతో పాటు అరుదైన గౌరవాలు ఆమె చెంత చేరుతున్నాయి. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానం అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సామ్.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్ లో ముందంజలో ఉంది. ఇక వీటితో పాటు తాజాగా మరో మైలురాయిని అమ్మడు అందుకొంది. ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ ఏడాది అత్యత్బుత నటన కనపరిచిన నటీనటులతో సామ్ టాప్ 4 లో నిలిచింది. మనోజ్ బాజ్ పాయ్ మొదటి స్థానంలోనూ, మనోజ్ త్రిపాఠి రెండో స్థానంలో, నవాజుద్దీన్ సిద్ధిఖి మూడో స్థానంలో ఉండగా.. సామ్ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. టాప్ 5 లో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే నిలబడింది.
నెట్ ఫ్లిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లా రాధికా ఆప్టే సినిమాలు ఉంటాయా సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది రాధికా పేరే ముందంజలో ఉంటుంది. కానీ, ఈ ఏడాది రాధికను సైతం వెనక్కి నేటి సామ్ 4వ స్థానంలో ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ఈ ఏడాది విడుదలైన ‘ఫ్యామిలీ మేన్ 2 ’ లో గ్రే షెడ్స్ కలిగిన పాత్రలో సామ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకొంది. రాజీ పాత్రలో సామ్ నటించింది అనడం కన్నా జీవించింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాత్ర ద్వారానే సామ్ ఎన్నో అవార్దులను, గౌరవాలను సొంతం చేసుకొంటుంది. ఇక టాప్ 10 లిస్ట్ లో టాలీవుడ్ హీరోయిన్లు సామ్, తమన్నా ఉండడం విశేషం.
Most popular OTT actors in India (Sep-Nov 2021): @BajpayeeManoj stays at no. 1, @kaykaymenon02 (no. 6), @thesushmitasen (no. 8), and @tamannaahspeaks (no. 10) make an entry in the Top 10 #OTT #Streaming pic.twitter.com/qO5bnAWHJb
— Ormax Media (@OrmaxMedia) December 28, 2021