Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. ఒక చిన్న యాడ్ చేసినా సరే కోటి, రెండు కోట్లకు తక్కువ తీసుకోదు. లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు, ఫారిన్ టూర్లు, ట్రిప్పులు.. ఆమెది రిచ్ లైఫ్. కానీ ఇదే సమంత వచ్చింది సాధారణ కుటుంబం నుంచే. ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే. ఆ విషయాలను తాజాగా మరోసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను నా గతాన్ని ఎన్నడూ మర్చిపోలేను అంటూ తెలిపింది.
Read Also : Samantha : చిన్నారులతో సమంత దీపావళి వేడుకలు
నేను ఓ సాధారణ కుటుంబం నుంచే వచ్చాను. నా కుటుంబం పడ్డ బాధలను ఎన్నటికీ మర్చిపోలేను. ఒకానొక టైమ్ లో భోజనం చేయడానికి కూడా మేం ఇబ్బంది పడ్డాం. అప్పుడు మా దగ్గర సరిగ్గా డబ్బులు ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన నేను.. మొదటి సినిమాతోనే చాలా మారిపోయాను. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాను. పేరు, డబ్బు, చప్పట్లు అన్నీ వచ్చాయి. సడెన్ గా వాటిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు. కానీ నేను పొంగిపోలేదు. ఎందుకంటే నేను ఓ గొప్ప లక్ష్యంతోనే సినిమాల్లోకి వచ్చాను. అదే నన్ను ముందుకు నడిపించింది. విజయాలకు పొంగిపోకుండా కష్టపడితేనే మనకు లైఫ్ ఉంటుందని నన్ను నేను మార్చుకుని ముందుకు వెళ్లాను అంటూ తెలిపింది సమంత.
Read Also : Bigg Boss 9 : నాగార్జున చేసిన పనికి ఏడ్చేసిన కంటెస్టెంట్లు
