Samantha: ట్రోల్స్.. ట్రోల్స్.. ట్రోల్స్.. సెలబ్రిటీస్ ఎన్నిసార్లు అవైడ్ చేసినా.. ట్రోలర్స్ మాత్రం సెలబ్రిటీలను ట్రోల్ చేయకుండా అవైడ్ చేయరు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ట్రోల్స్ ఎదుర్కుంటున్న సెలబ్రిటీస్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ఆమె జీవితంలో మంచి కానీ, చెడు కానీ..ఏదైనా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అలాగే ట్రోలర్స్ సైతం మంచి, చెడులో కూడా చెడును మాత్రమే వెతికి ఆమెపై నీచమైన ట్రోల్స్ చేస్తూ.. విమర్శలను అందుకుంటున్నారు. చైతో విడాకులప్పటి నుంచి ఈ ట్రోల్స్ మొదలయ్యాయి. విడాకులకు కారణం సామ్ అంటూ మొదలైన నెగెటివ్ ట్రోలింగ్.. ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. మాయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నాను అని చెప్పగానే అందరూ.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని పరామర్శిస్తుంటే.. సింపతీ కోసం ఏడుస్తుంది అని ట్రోల్ చేశారు. చికిత్స కోసం సినిమాలకు గ్యాప్ తీసుకుంటే.. డబ్బు ఎక్కువై తిరుగుతుంది అన్నారు. ఇక పబ్ లో చిల్ అయితే.. ఇదేనా నువ్వు తీసుకొనే చికిత్స అన్నారు. తన బాధను ఏడుస్తూ చెప్తే.. సినిమా ప్రమోషన్స్ కోసమని చెప్పుకొచ్చారు. ఇలా ఒకటి అని చెప్పలేం. ఈ ట్రోలింగ్ పై సామ్ ఎప్పుడు ఖండించింది లేదు. అయితే నవ్వుతూ వెళ్లిపోయేది.. లేకపోతే మౌనంగా ఉండిపోయేది.
ఇక తాజాగా ఆమె బికినీ ఫొటోస్ పై కూడా నీచమైన ట్రోలింగ్ జరుగుతుంది. న నిన్నటికి నిన్న సామ్.. మలేషియాలోని లంకావిలో అందమైన అడవులు, కొండలు పచ్చదనం జలపాతాల మధ్య బ్రౌన్ కలర్ టూ పీస్ బికినీతో అదరగొట్టింది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. తాను హెల్దీగా ఉన్నట్లు చూపించడానికి ఆమె ఈ ఫోటోను షేర్ చేయగా.. దీనికి కూడా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. మయోసైటిస్ అన్నారు.. చికిత్స తీసుకుంటుంది అన్నారు.. ఈమె ఏంటి బికినీలో పోజులు ఇస్తుంది. అసలు ఈమెకు ఆరోగ్య సమస్య ఉందా.. ? కావాలనే సింపతీ కోసం నటిస్తుందా అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకోపక్క ఆమె సినిమాల రిలీజ్ కు ముందే అనారోగ్య సమస్యలు బయటపడుతున్నాయి.. మరి ఇప్పుడు అలాంటివేం లేవా ..? అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా సామ్.. మయోసైటిస్ తో బాధపడుతుంది అన్నది మాత్రం నిజం.. ఆమె ఎలాంటి బాధను భరించింది అనేది ఆమెకు మాత్రమే తెలుసు అని సామ్ అభిమానులు చెప్పుకొస్తున్నారు.