సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తరువాత తిరిగి సింగిల్ స్టేటస్‌కి వచ్చేసింది. అలాగే సినిమాపై పూర్తిగా ఫోకస్ పెట్టేసింది. ప్రస్తుతం ఆమె పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భాషా హద్దులు లేకుండా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పలు సినిమాలకు సైన్ చేసిన ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే సామ్ కు సౌత్ లో, నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ గురించి ఫాలోవర్స్ కు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామ్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అన్న విషయం ఆమె వర్క్ అవుట్స్ వీడియోలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా అలాంటి ఓ ఇంటెన్స్ వర్కౌట్ వీడియోను షేర్ చేసింది సామ్.
Read Also : Prabhas : ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ హిట్స్ పై రెబల్ స్టార్ రియాక్షన్
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో హెవీవెయిట్‌లను అమాంతంగా ఎత్తేస్తోంది. ఈ వీడియోతో పాటు బలమైన శరీరం, బలమైన మనస్సు అంటూనే 2022-23 తనకు శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న సమయం అని సమంత పోస్ట్ చేసింది. సామ్ తన తన ట్రైనర్ జునైద్ పర్యవేక్షణలో హెవీ వెయిట్‌లను ఈజీగా ఎత్తేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక సామ్ ప్రస్తుతం “శాకుంతలం”, “యశోద” అనే రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులతో అభిమానులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరోవైపు రాజ్ అండ్ డికెతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బాలీవుడ్ చిత్రంలో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఓ మూవీ, అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే మరో హాలీవుడ్ మూవీకి కూడా సైన్ చేసింది.