పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇటీవలే “రాధేశ్యామ్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ప్రభాస్ ఖాతాలో ఉన్న నెక్స్ట్ ప్రాజెక్టులు షూటింగ్ దశల్లో ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడానికి ముందు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ప్రభాస్. అయితే తాజాగా ఓ మీడియా పోర్టల్ తో మాట్లాడిన ప్రభాస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ హిట్స్ పై స్పందించారు.
Read Also : KGF 2 : ఓటిటిలో ఎప్పుడంటే ?
ప్రభాస్ మాట్లాడుతూ “మనం త్వరలో మరిన్ని పాన్-ఇండియన్ చిత్రాలను చూస్తాము. నార్త్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలు కలిసి పని చేయాలి. మన ఫిల్మ్ మేకర్స్ క్రాస్-ఇండియన్ చిత్రాలపై దృష్టి పెట్టాలి. నేను ఇటీవల RRR చూశాను. నాకు సినిమా నచ్చింది. భారతీయ సినిమాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూడో బిగ్గెస్ట్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది. రాజమౌళి ఇకపై సౌత్ ఇండియన్ డైరెక్టర్ కాదు… ఆయన భారతీయ దర్శకుడు” అని ప్రభాస్ అన్నారు. ఇక ‘కేజీఎఫ్-2’ సక్సెస్ గురించి మాట్లాడుతూ “కేజీఎఫ్: చాప్టర్ 2 సూపర్ సక్సెస్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడితో నేను “సలార్” చేయడం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మనకు మరిన్ని పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లు రావాలి” అని ప్రభాస్ అన్నారు. సగం షూటింగ్ పూర్తయిన “సలార్” షూటింగ్‌ను త్వరలో తిరిగి ప్రారంభించనున్నారు. ఇటీవల మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ప్రభాస్ ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు.