Atlee : తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మార్కెట్ ఉంది. ఆయన తీసే సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి. అందుకే ఆయనతో చాలా మంది స్టార్ హీరోలు సినిమాలు తీసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికంటే ముందు ఓ డౌట్ ఉండేది. అట్లీతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ఉంటుందనే ప్రచారం మొన్నటి వరకు సాగింది. దానిపై తాజాగా సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. అట్లీతో ఇప్పట్లో సినిమా చేయట్లేదని తేల్చి చెప్పేశాడు. అట్లీతో చేసేది భారీ బడ్జెట్ సినిమా అని.. అందుకే దాన్ని ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు సల్మాన్ స్పష్టం చేశాడు.
Read Also : Vijayawada Crime: ప్రియురాలి హత్యకు న్యాయవాది ప్రయత్నం.. కారుతో ఢీకొట్టి..
కానీ భవిష్యత్ లో కచ్చితంగా అట్లీతో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సల్మాన్ ఖాన్ తో సినిమా లేదు అంటే కచ్చితంగా అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందేమో అని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ మూవీ భారీ బడ్జెట్ తో మైథలాజికల్ స్టోరీతో వస్తుండటంతో ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఈ గ్యాప్ లో అట్లీతో మూవీ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరి మధ్య కథ ఓకే అయిందని.. త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది పర్వదినాన దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే మాత్రం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ రావడం పక్కా. ఇద్దరూ వరుస హిట్లతో జోరుమీదున్నారు. మరి ఈ కాంబో ఎలా ఉంటుందో చూడాలి.