Salaar team planning midnight shows across India: సలార్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో అందరి దృష్టి సినిమా మీదనే ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతటా సాలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రభాస్ సాలార్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సలార్ మేకర్స్ 1 AM షోలను ప్రదర్శించడానికి అవకాశం – అనుమతి ఉన్న చోట్ల భారతదేశం అంతటా ప్రదర్శించాలని ప్లాన్ చేశారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం అంతటా సాలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది, ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్ ఔట్‌పుట్‌తో సంతృప్తి చెందానని వెల్లడించారు. ఇక ఈ సాయంత్రం నుండి, అన్ని ప్రాంతాల ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌లు ఓపెన్ అవుతాయి.
NRI Invitation: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్ఆర్ఐ ప్రతినిధులు..
ఇక ఇప్పటి వరకు ఎక్కడ బుకింగ్స్ ఓపెన్ చేసినా తెలుగుతో పాటు ఇతర భాషల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా 2023లో భారతీయ సినిమాకి రికార్డ్ ఓపెనర్‌గా నిలిచింది, ఇక KGF 2 మొదటి రోజు ఓపెనింగ్స్ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఇటీవలి సినిమాలు విజయవంతం కాలేదు. సలార్‌లో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ మరియు జగపతి బాబు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ – పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్‌ల కలయికలో వచ్చిన మొదటి చిత్రం. డిసెంబర్ 22న ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.