రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్. డార్క్ సెంట్రిక్ థీమ్ తో, హ్యూజ్ సెటప్ తో రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్లు సెట్ చేసే అవకాశం ఉంది. టీజర్, ట్రైలర్ తో డిజిటల్ రికార్డులని సెట్ చేసిన సలార్… బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్ల వర్షం కురిపించడం గ్యారెంటీ. డిసెంబర్ 22 దగ్గర పడుతుండడంతో హోంబలే ఫిల్మ్స్ ఎప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సాంగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. సలార్ ట్రైలర్ కన్నా ముందే సాంగ్ బయటకి వస్తుంది అనుకున్నారు కానీ ప్రశాంత్ నీల్ స్కెచ్ ని మార్చి సాంగ్ ని ఇప్పుడు దించుతున్నాడు.
‘సూరీడే’ అనే ఫ్రెండ్షిప్ సాంగ్ సలార్ సినిమా నుంచి బయటకి రానుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇస్తూ మేకర్స్… సూరీడే సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుందని చెప్పారు. సాంగ్ వస్తుందని అఫీషియల్ గా హోంబలే నుంచి ట్వీట్ వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని సీజ్ చేసారు. లక్షల్లో ట్వీట్ చేస్తూ సలార్, సలార్ సీజ్ ఫైర్, సూరీడే ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక సాంగ్ బయటకి వచ్చి… ఫ్రెండ్షిప్ సాంగ్ కాబట్టి కాస్త స్లోగా స్టార్ట్ అయ్యి ఒక్కసారి హైపిచ్ అందుకునేలా ఉంటే మాత్రం సాంగ్ దెబ్బకే సలార్ హైప్ మరింత పెరగడం గ్యారెంటీ. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ లో చూపించని ఎలిమెంట్స్ ని ప్రశాంత్ నీల్ ఏమైనా చూపిస్తాడేమో చూడాలి.