డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, డిసెంబర్ 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనగానే ఇండియాస్ బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతుంది అనే మాట ఇండియా మొత్తం వినిపించింది. ఈ ఎపిక్ క్లాష్ గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు కానీ వార్ ని కంప్లీట్ గా వన్ సైడ్ చేసేసాడు ప్రభాస్. సలార్ సీజ్ ఫైర్ సినిమాతో షారుఖ్ ని ఓవర్ షాడో చేసేసాడు ప్రభాస్. షారుఖ్ ని కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా ఓవర్ షాడో చెయ్యడం అనేది చిన్న విషయం కాదు. బాలీవుడ్ స్టార్ హీరోల వలన కూడా కానిది ప్రభాస్ చేసి చూపించాడు. డంకీ సినిమా రిలీజ్ కి ముందు నార్త్ లో థియేటర్స్ కి కబ్జా చేసినంత పని చేసారు. నార్త్ లో మల్టీప్లెక్స్ నుంచి నేషనల్ చైన్స్ కి చెందిన సింగల్ స్క్రీన్స్ వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ కి థియేటర్స్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చనే జరిగింది.
థియేటర్స్ దొరకని దగ్గర నుంచి డంకీ సినిమాని తీసేసి సలార్ కి కేటాయించే వరకూ తెచ్చాడు ప్రభాస్. డంకీ డే 1 60 కోట్లైతే ప్రభాస్ అంతకు మూడింతలు కలెక్ట్ చేసాడు. సెకండ్ డే అయితే షారుఖ్ అడ్డా అయిన నార్త్ లో డంకీ సినిమాకి కేవలం 16% ఆకుపెన్సీ మాత్రమే వచ్చింది. మండేకి ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో డంకీ సినిమాని సలార్ రీప్లేస్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. షారుఖ్ ని ప్రైమ్ టైమ్ లో తన ఏరియాలోనే బీట్ చేసి ప్రభాస్ యునానిమస్ గా ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ గా నిలిచాడు. ఇకపై బాలీవుడ్ హీరోలు ప్రభాస్ తో క్లాష్ కి ఎవరైనా రావాలంటే బాగా అలోచించి నిర్ణయం తీసుకుంటారేమో.