Salaar Khansar City really exists in IRAN: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా అనేక వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కథ అంతా ఖాన్సార్ అనే ఒక ఊహాజనిత నగరం చుట్టూ తిరుగుతుంది. భారతదేశం పక్కన పాక్ -గుజరాత్ మధ్య ఈ ప్రాంతం ఉందని సినిమాలో చూపించారు. అయితే తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ నిజంగానే ఖాన్సార్ అనే ఒక నగరం ఉంది.
Salaar OTT: సలార్ స్ట్రీమ్ అయ్యే ఓటీటీ- టెలికాస్ట్ అయ్యే శాటిలైట్ ఛానల్ ఇవే!
కానీ అది మన దేశంలో లేదా చుట్టుపక్కల దేశాల్లో మాత్రం లేదు. మనకి కాస్త దూరంగానే ఉండే ఇరాన్ దేశంలోని ఒక కౌంటీనే ఈ ఖాన్సార్. సుమారు 22 వేల మంది పర్షియన్లు ఈ సిటీలో నివసిస్తున్నారని అంచనా. అయితే సినిమాలో చూపినట్టు ఉన్న ఖాన్సార్ కి ఈ ఒరిజినల్ ఖాన్సార్ కి చాలా తేడా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, సప్తగిరి, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, జాన్ విజయ్, ఝాన్సీ, పృథ్వీరాజ్, టిను ఆనంద్ తదితరులు నటించారు. రచన, దర్శకత్వం బాధ్యతలు ప్రశాంత్ నీల్ వహించగా.. విజయ్ కిరంగదూర్ సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రఫి భువన్ గౌడ, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి, మ్యూజిక్ రవి బస్రూర్ అందించారు.