రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్టుగా వచ్చిన ఈ ఈవెంట్ బాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపోయే రేంజులో జరిగింది. స్టేజ్ పైన సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ… ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మినిమమ్ మూడు నెలల పాటు ఒక్క సినిమాని కూడా రిలీజ్ చెయ్యకండి, ఆ రేంజ్ సినిమా రాబోతుంది అని చెప్పాడు. ఈ మాట ఇప్పుడు సలార్ సినిమా కోసం వాడాల్సి వస్తుంది. బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ సాధించిన ప్రభాస్, నార్త్ లో సాలిడ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తున్నాడు. అక్కడ ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా సౌత్ కలెక్షన్ల స్థాయిలో రాబడుతుంది. ఆ రేంజ్ మార్కెట్ మైంటైన్ చేస్తున్న ప్రభాస్ నుంచి చాలా రోజులుగా సరైన హిట్ లేదు.
సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కివని… సలార్ అలా కాదు ప్రభాస్ కటౌట్ ని సరిపోయేలా, ప్రభాస్ ని టైలర్ మేడ్ లాంటి కమర్షియల్ యాక్షన్ డ్రామా జోనర్ లో సలార్ తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ లో ప్రభాస్ ని చూస్తే ఛత్రపతి ఇంటర్వెల్ బ్లాక్ లో ఉన్న ప్రభాస్ గుర్తొస్తున్నాడు. యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్ డెలివరీ, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్… ఇలా ప్రతి విషయంలో ప్రభాస్ పదేళ్ల క్రితం ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఎలాంటి ప్రయోగాల వైపు వెళ్లకుండా కంప్లీట్ గా ప్రభాస్ స్ట్రెంగ్త్ పైనే సలార్ తెరకెక్కింది. ఇలాంటి సినిమా ప్రభాస్ కి పడితే ఎలా ఉంటుందో తెలుగు ఆడియన్స్ కి బాగా తెలుసు, ఇప్పుడు ఆ విషయాన్నీ ఇండియా మొత్తం తెలుసుకోబోతుంది. అందుకే సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీలైనంత ఎక్కువ గ్యాప్ ని మైంటైన్ చేస్తే ఇతర సినిమాలు సలార్ దెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.