Salaar Censor report and Run time Details are out: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సెన్సార్ రిపోర్ట్ అలాగే రన్ టైమ్ వివరాలు బయటకు వచ్చాయి. సినీ వర్గాల నుంచి అందిస్తున్న సమాచారం మేరుకు ఇప్పటికే పాన్-ఇండియన్ మూవీ సలార్ సెన్సార్ పూర్తి అయింది, సినిమా మొత్తం చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి ‘A’ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే, సినిమా ట్రైలర్ లో హింట్ ఇచ్చినట్టుగానే టీమ్ భారీ యాక్షన్ డోస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సెన్సార్ అయ్యాక సలార్ రన్‌టైమ్ 2 గంటల 55 నిమిషాలుగా ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో వచ్చే వీకెండ్ లో సలార్ 2వ ట్రైలర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సలార్ లాంటి భారీ సినిమా కోసం టీమ్ దూకుడు ప్రమోషన్స్ చేయాల్సి ఉంది కానీ ఇప్పటి దాకా అలాంటిది ఏమీ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు.
Mansoor Ali khan: మెగాస్టార్ పై మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా
అయితే ఎట్టకేలకు సలార్ సెన్సార్ రిపోర్ట్ మరియు రన్‌టైమ్ వివరాలు బయటకు రావడంతో వారు సంతోషంగా ఉన్నారు. ఇండియన్ మూవీస్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా క్రేజ్ ఉన్న సినిమాల్లో సలార్ మొదటి వరుసలో ఉంది. కొద్ది రోజుల క్రితం ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఖాన్సార్ అనే ఒక రాజ్యాన్ని చూపడంతో పాటు సినిమా లైన్ ఏంటి అనే కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభాస్ నటించిన ఈ సినిమా రెండు సంవత్సరాల నుంచి నిర్మాణంలో ఉంది, యాక్షన్ ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతో సహా పలు భాషల్లో డిసెంబర్ 22, 2023న విడుదల కానుంది.