Mansoor Ali Khan sues megastar Chiranjeevi: నెగెటివ్, విలన్ పాత్రలకు ఫేమస్ అయిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఒక వివాదంలో చిక్కకున్న సంగతి తెలిసిందే. మన్సూర్ ఇటీవల మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ లియో సినిమాలో నేను త్రిషతో నటిస్తున్నానని వినగానే సినిమాలో పడకగది సీన్ ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను పడకగదికి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను ఎందుకంటే నేను చాలా సినిమాల్లో చాలా రేప్ సీన్లు చేశాను, ఇది నాకు కొత్త కాదు. కానీ కాశ్మీర్ షెడ్యూల్ సమయంలో ఈ కుర్రాళ్ళు త్రిషను సెట్స్‌లో కూడా నాకు చూపించలేదు అంటూ అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు.దీనిపై సోషల్ మీడియాలో జనాలు, సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తనను చిరంజీవి ట్విట్టర్‌లో ఖండించారు.
NTV Film Roundup: అమెరికాలో దేవరకొండ, హైదరాబాద్ లో రష్మిక.. ఊటీ చలిలో బాలయ్య!
దీనిపై తీవ్రంగా స్పందించిన మన్సూర్ అలీఖాన్ తన మాటలను అందరూ తప్పుగా తీసుకున్నారని, త్రిష, చిరంజీవిలపై కేసు పెడతానని కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు అన్నట్టుగానే చిరంజీవి, త్రిషలపై మన్సూర్ అలీఖాన్ పరువునష్టం కేసు వేశారు. పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (అకా ‘ట్విట్టర్’)లో తనపై పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు వారిపై మద్రాస్ హైకోర్టులో దావా వేశారు. త్రిష, కుష్బూ, చిరంజీవిలపై పరువునష్టం దావా వేయాలనే ఉద్దేశంతో చట్టపరమైన లేఖను విడుదల చేశారు. నేను వ్యక్తిగతంగా ఏ వ్యక్తులపై ఎలాంటి తప్పుడు ప్రకటన చేయలేదు, కానీ నేను పోషించిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలపై వ్యాఖ్యానించానని, ఇది నెమ్మదిగా వేరే అర్ధంతో వైరల్ అయిందని అన్నారు.