‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన నటించనున్నారు. 2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌ను దర్శకుల ద్వయం పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. టి సిరీస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఈ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ సెకండ్ షెడ్యూల్ ను తాజాగా సైఫ్ అలీఖాన్ పూర్తి చేశారు. ‘విక్రమ్ వేద’కు సంబంధించి సైఫ్ అలీ ఖాన్‌తో లక్నోలో 19 రోజుల పాటు సాగిన రెండవ చిత్రీకరణ షెడ్యూల్‌ను ముగించారు. ఈ షెడ్యూల్ లో సైఫ్ అలీ ఖాన్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారట మేకర్స్. ‘విక్రమ్ వేద’ 2022 సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపైకి రానుంది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ బాలీవుడ్ లో తెరకెక్కుతుండడం ఆసక్తికరంగా మారింది.